కాక్రోచ్ పార్టీని విప్లవంగా మార్చేద్దాం..ఇవాళ(జూన్6) ఢిల్లీలో సీజేపీ నిరసన

కాక్రోచ్ పార్టీని విప్లవంగా మార్చేద్దాం..ఇవాళ(జూన్6)  ఢిల్లీలో సీజేపీ నిరసన

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో నిరసనకు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ.. శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించే నిరసన సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని ‘ఎక్స్‌‌‌‌’లో కోరింది. శాంతియుతంగా చేపట్టే ఈ నిరసనను సక్సెస్‌‌‌‌ చేయాలని ఆ సంస్థ మద్దతుదారులకు పిలుపునిచ్చింది. 

‘రేపు కలుద్దాం తోటి కాక్రోచ్ మిత్రులారా! కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వదిలేదే లేదు. ఈ చిన్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఒక పెద్ద విప్లవంగా మార్చాల్సిన సమయం వచ్చింది’’ అని ఆ గ్రూప్ ఒక పోస్ట్‌‌‌‌లో పేర్కొంది. ఢిల్లీ వీధుల్లో శాంతియుతంగా, ప్రేమపూర్వక నిరసనలతో అందరం ఏకం కావాలని పిలుపునిచ్చింది.