ఆన్ లైన్ సెన్సేషన్, రాజకీయ వ్యూహకర్త, కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దుప్కే శనివారం (జూన్ 6) ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు సీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సీజీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనలో అభిజిత్ దుప్కే పాల్గొననున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారు క్రమశిక్షణతో, సంయమనంతో ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.
నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ లో సీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున సీజేపీ కార్యకర్తలు, మద్దతులు చేరుకున్నారు. కాక్రోచ్ జనతాపార్టీ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అనుమతిచ్చారు. ర్యాలీ నేపథ్యంలో జంతర్ మంతర్ లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు.
#कॉकरोच जनता पार्टी (सीजेपी) के संस्थापक अभिजीत दिपके शनिवार को जंतर-मंतर पर होने वाले प्रदर्शन से पहले दिल्ली पहुंचे और समर्थकों से अनुशासन बनाए रखने और प्रदर्शन को शांतिपूर्ण रखने का आग्रह किया #cocroachjantaparty #AbhijeetDipke @CJP_for_India @CJP_2029 @Cockroachisback #Delhi https://t.co/IOEUMTEaFe pic.twitter.com/0LS4YCg40M
— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 6, 2026
