NEET-UG పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, శాంతియుతంగా ధర్నా చేయడానికి జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు 'కాక్ రోచ్ జనతా పార్టీ' (CJP) స్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వీడియోలో, ఢిల్లీలో నేను చేయబోయే ఈ నిరసనలో పాల్గొనాలని అభిజీత్ దీప్కే తన మద్దతుదారులను, విద్యార్థులను కోరారు. జూన్ 6న ఎయిర్‌పోర్ట్ దగ్గరకు వచ్చి తనను కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగ పద్ధతిలో మనమందరం కలిసికట్టుగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా మన గళాన్ని వినిపించాల్సిన సమయం వచ్చింది. మనమంతా కలిసి గట్టిగా అడిగితే, వారు కచ్చితంగా మన మాట వింటారు అని ఆయన అన్నారు.
నేను జూన్ 6వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి ఎయిర్‌పోర్ట్ దగ్గరకు వచ్చి నన్ను కలవండి. మనం కలిసి జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన చేసుకోవడానికి పర్మిషన్ అడగడానికి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం అని ఆయన చెప్పారు.
NEET-UG పరీక్షల్లో జరిగిన గందరగోళం, లోపాల వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వీడియోలో అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు.
ALSO READ : మామిడి పండ్ల ముచ్చట సరే.. పిల్లల గురించి మాట్లాడరా
న్యాయవాదులకు 'సీనియర్' హోదా ఇచ్చే విషయంపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ కొందరిని బొద్దింకలు, పరాన్నజీవులు అని అన్నట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాతే ఈ కాక్ రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి బాగా పాపులర్ అయింది, అలాగే చాలామంది ప్రముఖుల మద్దతును కూడా పొందింది.
అయితే.. నకిలీ, తప్పుడు డిగ్రీలతో లాయర్ వృత్తిలోకి వచ్చే వారిని ఉద్దేశించి తాను ఆ మాటలన్నానని, కానీ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేశారని ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
దేశ భద్రతా కారణాల వల్ల మొదట ఈ కాక్ రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఆ తర్వాత అది Cockroach is Back అనే పేరుతో మళ్లీ వచ్చింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఆ పార్టీ స్థాపకుడికి రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించింది.
Will be returning to India to demand the resignation of the Education Minister.
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 1, 2026
I request the youth of India to join this peaceful protest at Jantar Mantar and exercise our constitutional right to seek accountability from the government. https://t.co/W8oZsGmgvi
