Cockroach Party: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ ఉదంతం భారత విద్యా వ్యవస్థను తీవ్రంగా కుదిపేసింది. తమ భవిష్యత్తు కోసం లక్షలాది మంది విద్యార్థులు, జెన్ జీ (Gen Z) యువత రోడ్లపైకి వచ్చి చేసిన సుదీర్ఘ పోరాటం చివరికి కేంద్ర రాజకీయాలోనే సంచలన మార్పులకు దారి తీసింది. 26 రోజుల పాటు సాగిన ఈ చారిత్రాత్మక ఉద్యమం జరిగింది.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. అండగా నిలిచిన Gen Z:
మే 3న జరిగిన నీట్-యుజీ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం మే 12న పరీక్షను రద్దు చేసి సీబీఐ (CBI) విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న జెన్ జీ విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలివచ్చి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాగా ఈ 26 రోజుల పాటు సాగిన ఉద్యమం గురించి ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో చూద్దాం..
మే 2026
* మే 3, 2026: దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా అభ్యర్థులకు నీట్-యుజి 2026 ప్రారంభ పరీక్ష నిర్వహించబడింది.
* మే 12, 2026: పేపర్ లీక్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి, విచారణ బాధ్యతలను సీబీఐ (CBI)కి అప్పగించింది.
జూన్ 2026
* జూన్ 6, 2026: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
* జూన్ 21, 2026: దేశవ్యాప్తంగా నీట్-యుజి రీ-ఎగ్జామ్ (తిరిగి పరీక్ష) నిర్వహించబడింది.
* జూన్ 28, 2026: పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
జులై 2026
* జులై 16, 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీ-ఎగ్జామ్ ఫలితాలను ప్రకటించింది.
* జులై 20, 2026: విద్యార్థులు పార్లమెంట్ వైపు 'సంసద్ చలో' భారీ ప్రదర్శన చేపట్టారు. దీంతో పోలీసులు మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
* జులై 24, 2026: కేంద్ర మంత్రులతో జరిపిన భేటీ అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా గురువారం నాడు కేంద్రంతో జరిగిన చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా 3 కండీషన్స్ పెట్టింది. అందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై కేసులు కొట్టివేత, నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుంటుబాలకి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
* జులై 25, 2026: ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, మిగతా రెండు డిమాండ్లకి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడంతో న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
#WATCH | Delhi: Moment when Union Education Minister Dharmendra Pradhan resigned from his post; visuals from the protest at Jantar Mantar pic.twitter.com/6YNf9LN3bN
— ANI (@ANI) July 25, 2026
A massive wave of students and youth carrying portraits of Shaheed Bhagat Singh and Dr. B.R. Ambedkar marched from Connaught Place (CP) Circle to the Jantar Mantar protest site, despite attempts by police to stop their movement. The students and youth are joining the July 20… pic.twitter.com/3prcrDzwWj
— CPIML Liberation (@cpimlliberation) July 20, 2026
HEARTBREAKING : 💔
— Priya Purohit (@Priyaa_Purohit) July 24, 2026
Just look at the brutally unleashed by the police against student protesters. These visuals are deeply disturbing. 👇 pic.twitter.com/gcEvsUFa6o
Latest violence against the students: As Dharmendra Pradhan resigns Delhi police resorts to lathi charge and tear gas against protestors.
— Srishti (@seekingsrishti) July 25, 2026
Video is from intersection of Sansad Marg and Tolstoy Marg in New Delhi on July 25.
pic.twitter.com/wy8BWVIKy2
