ఐటీ వార్: ఇన్ఫోసిస్ పై కాగ్నిజెంట్ ఫిర్యాదు.. రహస్యాలు దొంగిలించినట్టు ఆరోపణలు

ఐటీ వార్: ఇన్ఫోసిస్ పై కాగ్నిజెంట్ ఫిర్యాదు..  రహస్యాలు దొంగిలించినట్టు ఆరోపణలు

న్యూఢిల్లీ:  ఇన్ఫోసిస్ తన హెల్త్‌‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌‌వేర్‌‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ సాఫ్ట్‌‌వేర్ ప్రొవైడర్ కాగ్నిజెంట్ ట్రైజెట్టో శుక్రవారం టెక్సస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఇన్ఫోసిస్ తన డేటాబేస్‌‌ల నుంచి చట్టవిరుద్ధంగా డేటాను తీసుకుందని, ​ పోటీ సాఫ్ట్‌‌వేర్‌‌ను రూపొందించడానికి, ​ మార్కెట్ చేయడానికి ఉపయోగించిందని కాగ్నిజెంట్ వ్యాజ్యంలో పేర్కొంది.

ఇన్ఫోసిస్ ఈ ఆరోపణలను ఖండించింది. కోర్టులో తమ వాదనను వినిపిస్తామని తెలిపింది. ఫిర్యాదుపై స్పందించడానికి కాగ్నిజెంట్ అధికార ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. ఫిర్యాదు ప్రకారం, ఇన్ఫోసిస్​ ట్రైజెట్టో ​ సాఫ్ట్‌‌వేర్‌‌ను దుర్వినియోగం చేసి "ఫేసెట్స్​కోసం టెస్ట్​ కేసెస్"లను రూపొందించింది.