V6 News

ఎర్లీ బర్డ్ ద్వారా14 రోజుల్లో రూ.261 కోట్ల ఆస్తిపన్ను వసూల్.. జీహెచ్ఎంసీకి రూ.93.07 కోట్లు,

ఎర్లీ బర్డ్ ద్వారా14 రోజుల్లో రూ.261 కోట్ల ఆస్తిపన్ను వసూల్.. జీహెచ్ఎంసీకి రూ.93.07 కోట్లు,
  • జీహెచ్ఎంసీకి రూ.93.07 కోట్లు, 
  •  ఎంఎంసీకి 61.93 కోట్ల రాబడి 
  • అత్యధికంగా సీఎంసీకి రూ.106.89 కోట్లు
  • వివరాలు వెల్లడించిన కమిషనర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లలో ఈ నెల 1 నుంచి 14 వరకు ఎర్లీ బర్డ్ ద్వారా రూ.261 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని జీహెచ్ఎంసీ కమిషనర్​కర్ణన్​తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 14 రోజుల్లో జీహెచ్ఎంసీ రూ.93.07 కోట్లు వచ్చిందన్నారు. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ నుంచి రూ.39.43 కోట్లు, తక్కువగా శంషాబాద్ జోన్ నుంచి రూ.6.51 కోట్లు వచ్చిందన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసేవారికి ఈ నెలంతా ఎర్లీ బర్డ్ స్కీమ్ అందుబాటులో ఉంటుందన్నారు. మూడు కార్పొరేషన్లకి సంబంధించి మై క్యూర్ యాప్, మీసేవ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చన్నారు. యాప్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని, ఇపుడు ఇష్యూస్ సాల్వ్ చేశామన్నారు. 

అలాగే మై జీహెచ్ఎంసీ యాప్ ని  ప్లే స్టోర్ ద్వారా అప్ డేట్ చేసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 11.47 లక్షల ప్రాపర్టీలు ఉండగా, 8.83 లక్షల రెసిడెన్షియల్, 2.64 లక్షల కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయన్నారు. గతేడాది ఎర్లీ బర్డ్ తో పోలిస్తే ఈసారి కొంచెం  తక్కువగా వసూలైందన్నారు. మూడు కార్పొరేషన్ల అప్పుల విభజనపై ప్రభుత్వానికి కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని, సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఫుట్ పాత్ ల ఆక్రమణలకి సంబంధించి ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ ద్వారా  తొలగిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అడిషపనల్ కమిషనర్లు ప్రియాంక అలా, రాధిక గుప్తా, జాయింట్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. 

  • ఇంకా జీహెచ్ఎంసీ పేరుతో చెక్కులిస్తున్నారు 

ఎర్లీ బ‌‌‌‌ర్డ్ స్కీమ్ తో  ఆస్తి ప‌‌‌‌న్ను కడితే 5 శాతం రాయితీ పొందొచ్చని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఏడాది రూ. 260 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, ఈ 15 రోజుల్లోనే సీఎంసీకి 61.93 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఫైనాన్షియల్​ఇయర్​కి రూ. 240 కోట్లు ఎర్లీ బ‌‌‌‌ర్డ్ స్కీమ్ ద్వారా వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీ నుంచి ఎంఎంసీ విభ‌‌‌‌జన అయినప్పటికీ కొందరు జీహెచ్ఎంసీ పేరుతో చెక్కులు ఇస్తున్నారన్నారు. చెక్కులు ఇచ్చేవారు కమిషనర్ ఎంఎంసీ  అని రాస్తేనే వ్యాలిడ్​అవుతుందన్నారు. అడిషనల్ కమిషనర్లు  రాధికా గుప్తా,  సంచిత్ గంగ్వార్ తదితరులు 
పాల్గొన్నారు.

 

  • సీఎంసీకే అత్యధిక ఆదాయం...

మూడు కమిషనరేట్లతో పోలిస్తే సీఎంసీకి అత్యధికంగా రూ.106.89 కోట్ల ఆదాయం వచ్చింది. మూడు చోట్లా కలిపి గతేడాది 14 రోజుల ఎర్లీబర్డ్ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది రూ.41.63 కోట్లు తగ్గింది, లాస్ట్ ఇయర్ 14 రోజుల్లో పాత జీహెచ్ఎంసీతోపాటు విలీనమైన ప్రాంతాల్లో కలిపి రూ.303.31 కోట్లు వచ్చింది. గతేడాది ఫైనాన్షియర్ లో పాత జీహెచ్ఎంసీతోపాటు విలీనమైన ప్రాంతాల్లో కలిపి ఎర్లీబర్డ్ ద్వారా 9,92,360 ఆస్తుల యజమానుల నుంచి రూ.1096.64 కోట్లు వచ్చింది. కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు కార్పొరేషన్లకు రూ.523.83కోట్ల ఆస్తి పన్ను బకాయి పడగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5834.08 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉంది.