V6 News

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి  : కలెక్టర్ అంకిత్

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి  : కలెక్టర్ అంకిత్

బూర్గంపహాడ్, వెలుగు: రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బూర్గంపహాడ్​కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, మార్కెట్ యార్డ్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారం, మెనూలను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ డ్రాయింగ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు.