ఖమ్మం రూరల్, వెలుగు: మున్సిపల్ పోలింగ్విధులు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్అనుదీప్దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దతండాలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్సామగ్రి పంపిణీపై సూచనలు చేశారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బ్యాక్సులకు సీలింగ్, స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. స్ట్రాంగ్రూమ్వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఉండాలని, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పాటించాలని సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్ నవీన్ బాబు, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, కళాశాల యాజమాన్యం నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఆర్థిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి
ఆర్థిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు కలెక్టరేట్ లో సోమవారం ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతీ పౌరుడికి ఆర్థిక అక్షరాస్యతపై, ఆన్లైన్ మోసాలపై అవగాహన ఉండాలని చెప్పారు. డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్ష రైనా, ఎల్డీఎం రవిప్రసాద్, టీజీబీ రీజినల్ మేనేజర్ ప్రసన్న కుమార్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరామ్ బరన్ తదితరులు పాల్గొన్నారు.
