ఖమ్మం, వెలుగు: జిల్లాలో జీరో మాతృ, శిశు మరణాలు లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అధికారులు పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మాతృ, శిశు మరణాలు తగ్గింపు, సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతి ప్రసవం సురక్షితంగా జరుగుతుందనే సందేశం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న హై రిస్క్ గర్భిణీలను ఒక్క వారం లోపు పూర్తి స్థాయిలో గుర్తించి, వారి కోసం బర్త్ ప్లానింగ్ సిద్ధం చేయాలని సూచించారు.
అంతకుముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఇందులో రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 30 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వాటిని యుద్ధ ప్రాతిపదికన సరి చేయాలన్నారు.

