మెదక్‌టౌన్, వెలుగు: ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్‌గా వ్యవహరించి సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలని మెదక్ కలెక్టర్ప్రతిమాసింగ్అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించుకొని గ్రామాలను మోడల్‌గా తీర్చిదిద్దాలన్నారు. అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు లేని చోట్ల కొత్త బిల్డింగ్స్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

