నెట్వర్క్, వెలుగు : దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. ఆయా కలెక్టరేట్, మండల, డివిజన్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ ఏర్పాటై 30నెలలు పూర్తయినందున ప్రభుత్వ ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్ తో తెలంగాణాలో 2వ పీఆర్సీ అమలు చేయాలన్నారు. పీఆర్సీ గడువు పొడిగించవద్దని వెంటనే పీఆర్సి నివేదిక తెప్పించి జూన్ 2 లోపు పీఆర్సీ అమలు చేయాలని
డిమాండ్ చేశారు

