V6 News

మెదక్ జీజీహెచ్‌‌ కు రూ.3.17 కోట్లు

మెదక్ జీజీహెచ్‌‌ కు రూ.3.17 కోట్లు

మెదక్. వెలుగు: మెదక్ గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్(జీజీహెచ్)కు రూ.3,17,80,979 మంజూరయ్యాయి. హెల్త్​, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్​ డిపార్ట్‌‌ మెంట్‌‌ ద్వారా ఈ నిధులు కేటాయిస్తూ ప్రిన్సిపల్​సెక్రటరీ డాక్టర్​క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల్లో సర్జికల్​ఎక్విప్​మెంట్​కోసం రూ.1,61,25,000, బ్లడ్ కంపోనెంట్​సెపరేటర్​కోసం రూ.63 లక్షలు, ఎన్‌‌ఎంసీ ఎక్విప్‌‌మెంట్‌‌ కోసం రూ.82 లక్షలు, సర్జికల్​ఇంప్లాంట్స్​కోసం రూ.11,55,979 కేటాయించారు.

అలాగే నర్సాపూర్​ ఏరియా హాస్పిటల్‌‌కు రూ.19,15,850 మంజూరయ్యాయి. 500 ఎంఏ ఎక్స్​రే మిషన్, ఈసీజీ మిషన్​, షాడోలెస్​సీలింగ్​ల్యాంప్, సెక్షన్​ఆపరేటస్​ కోసం ఈ నిధులు కేటాయించారు. మెదక్ జీజీహెచ్‌‌కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించినందుకుగానూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌రావుకు మున్సిపల్​ చైర్‌‌‌‌పర్సన్‌‌ రాధికారాజ్​కతజ్ఞతలు తెలిపారు.