జనగామ అర్బన్, వెలుగు: జనగామ మండలంలోని చౌడారం పరిధిలోని టీజీఎంఎస్, జూనియర్ కళాశాల పీఎంశ్రీ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, ఐటీ ల్యాబ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ల్యాబ్, లైబ్రరీలను పరిశీలించారు.
బడిబాట కార్యక్రమాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌ను సందర్శించి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

