భూమికి నక్షత్రం బంగారు కానుక

భూమికి నక్షత్రం బంగారు కానుక

టొరంటో: భూమికి బంగారం కానుక వచ్చింది. ఆ ఇచ్చింది ఓ నక్షత్రం. అవును, బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలను ఆ నక్షత్రమే కానుకగా ఇచ్చిందట. స్పేస్​లో ఎక్కడో దూరంగా ఉన్న ఆ నక్షత్రం పేలడం వల్ల భూమిలోకి బంగారం, ప్లాటినం వంటి లోహాలు వచ్చి చేరాయట. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్​ గ్వెల్ఫ్​, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 80 శాతం మేర భార లోహాలు ఇలాంటి నక్షత్రాల పేలుడు వల్లే వచ్చాయని చెబుతున్నారు. సూర్యుడి కన్నా 30 రెట్లు ఎక్కువ బరువుండే ఈ నక్షత్రాల పేలుడును సూపర్​కంప్యూటర్లతో సిమ్యులేషన్​ చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. వాటిలోని గురుత్వ బలాల ఒత్తిడితో అవి పేలి బ్లాక్​హోల్స్​ను ఏర్పాటు చేశాయని, అలా విశ్వంలో భార లోహాలను వదిలాయని అంటున్నారు. నక్షత్రాల్లోని న్యూక్లియర్​ రియాక్షన్ల వల్లే బంగారం, ప్లాటినం, యురేనియం, ప్లుటోనియం వంటివి ఏర్పడ్డాయని చెబుతున్నారు.