బార్​పై వినతి పత్రాన్ని పరిష్కరించండి

బార్​పై వినతి పత్రాన్ని పరిష్కరించండి
  •  జీహెచ్ఎంసీని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: స్థానిక బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని టేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్ట్రో బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమ మద్య విక్రయంతో పాటు అక్రమ నిర్మాణాలు చేస్తోందంటూ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలైంది. దీనిని ఇటీవల జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారించారు. టేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిరిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారంపై ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15న ఇచ్చిన వినతిపత్రాన్ని మూడు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీని ఆదేశించారు.

తమ వినతిపత్రంపై జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ చర్యలు తీసుకోవడం లేదంటూ సిటీలోని యూసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడకు చెందిన కె. చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. తమ ఆదేశాల అమలు గురించి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో వారంలో జరిగే విచారణ సమయంలో చెప్పాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీని న్యాయమూర్తి ఆదేశించారు.