FIFA Quarter Finals: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగియడంతో, టోర్నమెంట్ అత్యంత కీలకమైన చివరి దశకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టాప్-8 జట్లు (క్వార్టర్ ఫైనలిస్ట్‌లు) తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఫుట్‌బాల్ దిగ్గజాలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు ఈసారి ఊహించని రీతిలో మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లాయి. దీంతో నాలుగు బ్లాక్‌బస్టర్ నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేచింది.
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్:
* జూలై 10: ఫ్రాన్స్ vs మొరాకో
* జూలై 10: స్పెయిన్ vs బెల్జియం
* జూలై 12: నార్వే vs ఇంగ్లాండ్
* జూలై 12: అర్జెంటీనా vs స్విట్జర్లాండ్
రౌండ్ ఆఫ్ 16 లో ఏ జట్టు ఎలా గెలిచిందంటే?:
* ఫ్రాన్స్: పరాగ్వేపై 1–0తో విజయం
* మొరాకో: కెనడాను 3–0తో సంచలన గెలుపు
* స్పెయిన్: హై-ప్రొఫైల్ ఐబీరియన్ డెర్బీలో పోర్చుగల్‌ను 1–0తో విజయం
* బెల్జియం: హోస్ట్ దేశమైన యునైటెడ్ స్టేట్స్‌పై 4–1 తేడాతో ఘన విజయం
* ఇంగ్లాండ్: మెక్సికోపై 3–2తో గెలిచి క్వార్టర్ ఫైనల్ కి అడుగు
* నార్వే: ఫుట్‌బాల్ దిగ్గజం బ్రెజిల్‌కు 2–1తో షాక్
* అర్జెంటీనా: ఈజిప్టుపై 3–2 తేడాతో విజయం
* స్విట్జర్లాండ్: కొలంబియాతో మ్యాచ్ డ్రా (0–0), పెనాల్టీ షూటౌట్‌లో గెలుపు
Next: Quarter-finals#FIFAWorldCup pic.twitter.com/To50MPa0Ye
— FIFA World Cup (@FIFAWorldCup) July 8, 2026
