బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్

బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రభుత్వం రూ.187 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తం రూ.187,13,87,000 నిధులకు అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేశారు. వచ్చే నెలలో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో వివిధ పనులకు ఖర్చుచేసేందుకు ఇవి విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.