ఎండకాలంలో తుంగభద్రకు స్వల్ప వరద

ఎండకాలంలో తుంగభద్రకు స్వల్ప వరద

 అయిజ, వెలుగు: కర్నాటకలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి స్వల్ప వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ నీరు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) మీదుగా బుధవారం.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని పులికల్  గ్రామ సమీపంలోనున్న నాగలదిన్నె బ్రిడ్జి వద్దకు చేరుకుంది.

రెండు నెలలుగా వట్టి పోయిన తుంగభద్రకు వరద నీరు రావడంతో నది తీర గ్రామాల ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాలకు, పశుపక్షాదులకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. రైతులు వరి నారు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.