బోరబండలో యువకుడి దారుణ హత్య

బోరబండలో యువకుడి దారుణ హత్య
  •     నిమ్స్ మే గ్రౌండ్ లో ఘటన
  •     మృతుడు వనపర్తి జిల్లా వాసి

జూబ్లీహిల్స్​,వెలుగు: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం  రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ​రహ్మత్​నగర్​డివిజన్​కార్మికనగర్​బస్టాప్​సమీపంలోని నిమ్స్​మే ఖాళీ స్థలంలో ఓ యువకుడిని మర్డర్ చేసినట్టు పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందింది. ఎస్సార్​నగర్​డివిజన్​ఏసీపీ పి.వెంకట రమణ, బోరబండ ఇన్​స్పెక్టర్ ఎస్.వీరశేఖర్​ టీమ్ వెళ్లి పరిశీలించారు. క్లూస్​టీంతో ఆధారాలను సేకరించారు. మృతుడి పొట్ట, వీపుపై కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు గురైన యువకుడిని వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం, కందూరు గ్రామానికి చెందిన తరుణ్​తేజ (28) గా గుర్తించారు. ఇతడు టీవీ సీరియల్స్​లో మేకప్​ ఆర్టిస్ట్​ గా చేస్తున్నట్టుగా తెలిసింది. ఎల్లో కలర్​ టీ షర్ట్, నిక్కర్​ధరించి ఉండగా చెవికి పోగులు, చేతికి కడియంతోపాటు చేతిలో సెల్​ఫోన్​ఉంది. 

గోడ పక్కన డెడ్ బాడీ .. 

యువకుడి డెడ్ బాడీ  గ్రౌండ్ లోని గోడ పక్కన ఉంది. అక్కడే హత్య జరిగిందా..?  లేక ఎక్కడైనా చంపి ఇక్కడ పడేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ఖాళీ స్థలంలోకి వెళ్లాలంటే స్థానికులకు మాత్రమే సాధ్యం. నాలాపై న ఖాళీ ఉన్నట్టు అక్కడి వారికి మాత్రమే తెలిసే చాన్స్ ఉంది.