జిమ్ చేస్తూ కుప్పకూలిన హాస్యనటుడు.. ఆస్పత్రికి తరలింపు

జిమ్ చేస్తూ కుప్పకూలిన హాస్యనటుడు.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. బుధవారం ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో... ఆయన్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. జిమ్‏లో ట్రెడ్ మిల్ పై పరిగెత్తుతున్న సమయంలో శ్రీవాస్తవ ఛాతిలో నొప్పితో కుప్పకూలినట్లు అతని అనుచరులు తెలిపారు. ప్రస్తుతం శ్రీవాస్తవ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కానీ రెండు రోజులు పరిశీలనలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అతని ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

బుల్లితెర ప్రేక్షకులకూ రాజు శ్రీవాస్తవ సుపరిచితుడే. ఆయన 2005-2017 మధ్య కాలంలో టీవీలో ప్రసారమైన కామెడీ టాలెంట్ షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ తో రాజు శ్రీవాస్తవ అభిమానులు సంపాదించుకున్నాడు. అలా దేశంలోని అత్యంత ఫేమస్ స్టాండ్ అప్ కమెడియన్లలో ఒకరిగా శ్రీవాస్తవ నిలిచారు. సెలబ్రెటీలను, రాజకీయ నాయకులను ఇమెటేట్ చేయడంలో రాజు దిట్ట. మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా, ఆమ్దాని అత్తన్ని ఖర్చు రూపయ్య వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 3లోనూ పాల్గొన్నాడు.