మోడీకి క్లీన్ చీట్ పై ఈసీలో అసమ్మతి వార్

మోడీకి క్లీన్ చీట్ పై ఈసీలో అసమ్మతి వార్

సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్​లో కమిషనర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు తాను ఈసీ  కోడ్​ ఇష్యూ సమావేశాలకు రావడంలో అర్థం లేదని ఆయన చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ సునీల్​ అరోరాకు లేఖ రాశారు. ఈ నెల 4న ఆయన లేఖ రాయగా.. తాజాగా బయటకు వచ్చింది. అయితే కమిషన్ లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమేనని సీఈసీ అరోరా శనివారం అన్నారు. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో కమిషనర్లకు, సీఈసీకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అలాంటి విషయాలపై అధికారులు రిటైర్మెంట్ తర్వాత పుస్తకాలు రాయడం ద్వారా అందరికీ తెలిసేవని చెప్పారు.కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్ల మధ్య విభేదాలున్నట్లు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు తాను కోడ్ ఉల్లంఘన ఇష్యూలకు సంబంధించిన మీటింగ్ లకు రావడంలో అర్థంలేనిదని పేర్కొంటూ ఈ నెల 4న చీఫ్ ఎలక్షన్ కమిషనర్  సునీల్ అరోరాకు అశోక్ లేఖ రాశారు. దీనిపై నేషనల్ మీడియాలో కథనాలు రావడంతో కమిషనర్ లేఖపై సీఈసీ సునీల్ అరోరా శనివారం స్పందించారు. కమిషన్ లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమేనన్నారు.

కమిషన్ సభ్యులు కవలలు కాదు..అభిప్రాయ భేదాలుంటాయి

ఎన్నికల సంఘానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై మీడియాలో కథనాలు రావడంపై సీఈసీ అరోరా అభ్యంతరం తెలిపారు. కమిషన్ అంతర్గత విషయాలన్నీ బయటపడవని.. మోడల్‌‌ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) అంతర్గత కార్యాచరణ, నిర్ణయాలను మీడియా బయటపెట్టిందన్నారు. ఈసీఐలోని ముగ్గురు కమిషనర్లు క్లోన్స్‌‌, టెంప్లేట్స్‌‌ కాదని.. వారిమధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయని చెప్పారు. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో కమిషనర్లకు.. సీఈసీకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని గుర్తుచేశారు. అలాంటి విషయాలు అధికారులు రిటైర్మెంట్ తర్వాత పుస్తకాలు రాయడం ద్వారా అందరికీ తెలిసేవని చెప్పారు.

కోడ్ ఉల్లంఘన ఇష్యూలో పోల్ ప్యానెల్ చట్టాలు కమిషన్ సభ్యుల ఏకగ్రీవ అభిప్రాయానికే  ప్రాధాన్యతనిస్తాయని..అలా కానప్పుడు మెజారిటీ నిర్ణయాన్ని గుర్తిస్తాయని అరోరా చెప్పారు. ఫుల్ కమిషన్ మీటింగ్ లో మైనార్టీ విభేదాలకు సంబంధించిన విషయాలు నమోదు కావని తెలుసుకుని కమిషనర్ లావాసా..కోడ్ ఉల్లంఘన ఇష్యూ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. కోడ్ ఉల్లంఘనలపై మెజారిటీ నిర్ణయాన్నే కమిషన్ వెల్లడిస్తుందని..ఇందులో వ్యక్తమైన మైనార్టీ అభ్యంతరాలను ఈసీ లీగల్ డివిజన్ ఫైల్​లో రికార్డు వరకే పరిమితం చేస్తుందని తెలిపారు.

మీడియాలో వచ్చిందేంటంటే

బీజేపీ చీఫ్ అమిత్​షా, ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఐదు ప్రసంగాల్లో కోడ్ ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఈసీ క్లీన్ చిట్ ఇచ్చిందని.. దీనిపై ఎన్నికల కమిషనర్ లావాసా అసంతృప్తిని వ్యక్తంచేశారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. సమావేశాల్లో తన అభిప్రాయాలకు ప్రాధాన్యం లేనప్పుడు తాను పాల్గొనడంలో కూడా అర్థంలేదని పేర్కొంటూ సీఈసీ అరోరాకు లేఖ రాసినట్లు పేర్కొంది. పారదర్శకంగా నిర్ణయాలు వెల్లడించేందుకు లావాసా చేసిన సూచనలను ఈసీఐ విస్మరిస్తోందని, అందుకే ఆయన చర్చల్లో పాల్గొనబోనంటూ లేఖలో పేర్కొన్నారని మీడియా కథనం వివరించింది.