10 వేల అప్పు  కట్టలేక ఆత్మహత్య

10 వేల అప్పు  కట్టలేక ఆత్మహత్య

శామీర్ పేట, వెలుగు: తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట పీఎస్​ పరిధిలో జరిగింది.  పొన్నాల గ్రామానికి చెందిన ఆనంద్ (23) ప్రజ్ఞాపూర్​కు చెందిన యశోద నుంచి 3 నెలల క్రితం రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె గతంలో ఆనంద్ ఇంటికి వచ్చి గొడవ చేసింది. దీంతో ఆనంద్ సోదరుడు ఆ డబ్బులను తాను   ఇస్తానని ఆమెతో చెప్పాడు. . రోజులు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం యశోద కొంతమందితో కలిసి మరోసారి ఆనంద్​ ఇంటికి వచ్చి డబ్బులు తిరిగివ్వాలని గొడవ చేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ ఇంటి ముందు గొడవ జరుగుతుండగానే లోపలికి వెళ్లి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.