గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు కామన్ ఎంట్రెన్స్

గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు కామన్ ఎంట్రెన్స్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు ఇకపై ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్–సీఈటీ) ద్వారా రిక్రూట్​మెంట్ జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని ఆలోచిస్తోంది. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు, కొన్ని గెజిటెడ్ పోస్టులు, గ్రూప్ సి పోస్టులు, వాటికి సమాన స్థాయి పోస్టుల రిక్రూట్​మెంట్​కు ఒకే సెట్ నిర్వహించడంతో ఖర్చు తగ్గడంతో పాటు, అభ్యర్థులకు ప్రతి నోటిఫికేషన్ కు ఫీజులు చెల్లించడం, అప్లై చేయడం లాంటి టెన్షన్లు తప్పుతాయి.

పాలనను సులభతరం చేసేందుకు, తద్వారా ఉద్యోగాభ్యర్థులకు వెసులుబాటు కలిగించాలన్న ప్రధాని సూచన మేరకు ఈ ప్రతిపాదన చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. డిగ్రీ, ఇంటర్, టెన్త్ పాసైనవారికోసం వేర్వేరుగా సెట్ నిర్వహిస్తుంది. ఇందులో క్వాలిఫై అయిన క్యాండేట్లు రైల్వే, బ్యాంకింగ్, ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి ఉద్యోగాలకు వేర్వేరుగా ప్రిలిమ్స్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఒకసారి సెట్ క్వాలిఫై అయిన స్కోర్ తో మూడేళ్ల వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసుకునే వెసులుబాటు కలగనుంది.