
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ఎమ్మెల్యే టికెట్లకు విపరీతంగా పోటీ ఉంది. 119 నియోజకవర్గాలకు గాను 1,025 దరఖాస్తులు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్ప.. మరెవరూ దరఖాస్తు చేయలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబుల నియోజకవర్గాల నుంచి రెండుకన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు చెబుతున్నారు.
ఈ దరఖాస్తుల స్క్రూటినీ ఆదివారం నుంచి మొదలవుతుందని తెలిసింది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎన్ని అప్లికేషన్లు పడ్డాయన్నది సోమవారం నాటికి తెలిసే అవకాశాలున్నాయి. కాగా, చాలామంది సీనియర్లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. వారికి హైకమాండ్ టికెట్లు ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అదే విధంగా చివరి నిమిషంలో పార్టీలో చేరే వారికి టికెట్ అడ్జెస్ట్మెంట్ ఎట్లా చేస్తారన్న డౌట్లు కూడా ఉన్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్లోని కొందరు అసంతృప్త నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాయబారం చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ వారికి టికెట్ హామీతో పార్టీలోకి తీసుకొస్తే, హైకమాండ్ ఒప్పుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.