కంటి వెలుగు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల ఆందోళన

కంటి వెలుగు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల ఆందోళన

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన ఆయన కాన్వాయ్ ను  కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. సరైన రోడ్డు లేని కారణంగా ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్ట్ బిలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.