V6 News

ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తరు?...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు వెలిసిన ఫ్లెక్సీలు

ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తరు?...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు వెలిసిన ఫ్లెక్సీలు

కాచిగూడ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్‌‌లో ఫ్లెక్సీలు పెట్టింది. కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి ఇంటికి సమీపంతోపాటు సిటీలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ బీజేపీ ఎంపీల ఫొటోల కింద ‘ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తరు?’ అని రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించింది. 

తేజస్వి కామెంట్లను ఖండించడంలో బీజేపీ నేతలు ఫెయిల్‌‌ అయ్యారని కమిటీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించేలా చేసిన తేజస్వి వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనంగా ఉండటం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. కిషన్ రెడ్డితోపాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు వెంటనే స్పందించి తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌‌ చేశారు.