వ్యవసాయంలో పెను మార్పులు తెస్తాం..మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

వ్యవసాయంలో పెను మార్పులు తెస్తాం..మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

ట్యాంక్ బండ్, వెలుగు: వ్యవసాయరంగంలో వస్తున్న సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని పెను మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. యువత సైతం ఐటీ రంగాన్ని, పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలిపెట్టి వ్యవసాయ రంగం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్​ ఎన్టీఆర్  స్టేడియంలో మూడు రోజులుగా కొనసాగుతున్న రైతు బడి అగ్రిషోకు ఆదివారం మంత్రి హాజరై స్టాళ్లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రైతు బిడ్డనేనని, ప్రతిరోజు వ్యవసాయ పనులను పరిశీలిస్తానని, ఆ తర్వాతనే ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్​ సాగు చేయాలని సూచించారు. అనేక కంపెనీలు రైతుల వద్దకు నేరుగా వెళ్లి వ్యవసాయ పనిముట్లపై అవగాహన కల్పిస్తే, వాటికి సబ్సిడీ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

జూబ్లీహిల్స్ కు మంచి రోజులు..

జూబ్లీహిల్స్: జూబ్లీ హిల్స్  నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఉప ఎన్నికలో మధురానగర్  కాలనీవాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా  ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. రాయల నాగేశ్వరరావు, బండి రమేశ్, చిన్న శ్రీశైలం యాదవ్  పాల్గొన్నారు.