బుద్ధిజం ఒక్కటే ప్రపంచ శాంతికి మార్గం.. బుద్ధుని ఆలోచనలతో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం సాగుతోంది: భట్టి విక్రమార్క

బుద్ధిజం ఒక్కటే ప్రపంచ శాంతికి మార్గం.. బుద్ధుని ఆలోచనలతో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం సాగుతోంది: భట్టి విక్రమార్క
  • హైదరాబాద్‌‌కు చేరుకున్న 3వ ధమ్మయాత్ర
  • ఘన స్వాగతం పలికిన భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్ కోదండరాం

ట్యాంక్‌‌బండ్, వెలుగు: ప్రపంచ శాంతికి బుద్ధిజం ఒక్కటే మార్గంగా కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ శాంతి కోసం బౌద్ధ భిక్షులు బుద్ధుని బోధనలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. ‘అవకెనిన్ంగ్ ది బుద్ధ టీచింగ్’అనే థీమ్‌‌తో ఫిబ్రవరి 2 నుంచి మార్చి 3 వరకు తలపెట్టిన 3వ ధమ్మ యాత్ర బుధవారం హైదరాబాద్‌‌లోని ఎన్టీఆర్ మార్గ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుంది. 

ఈ యాత్రకు భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్ కోదండరాం, సంగ్సక్ కోవిడో, గగన్ మాలిక్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అంబేద్కర్, బుద్ధుని ఆలోచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. నాగార్జునసాగర్‌‌‌‌లోని బుద్ధ వనాన్ని అన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 

మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. స్వర్ణ భూమి నుంచి బుద్ధ భూమి వరకు ఆశయాత్ర నినాదంతో ఆధ్యాత్మిక పాదయాత్ర చేపట్టారని తెలిపారు.థాయిలాండ్, ఇండియాకు చెందిన బౌద్ధ భిక్షువులు 400 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. బుద్ధుని శాంతి, దయ బోధనలను సమాజానికి చాటడం యాత్ర ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.