మైనార్టీల సంక్షేమానికి కృషి ..ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

మైనార్టీల సంక్షేమానికి కృషి ..ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి/ తొర్రూరు, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రంజాన్ తోఫా అందజేశారు. కాగా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాంగ్రెస్ ఆఫీస్​లో ఆదివారం పట్టణ కేంద్రానికి చెందిన జమా మజీద్ కమిటీ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, బొకేలు అందించి సన్మానించారు.