పౌరసత్వ బిల్ కు వ్యతిరేకంగా అంజన్ కుమార్ ర్యాలీ..

పౌరసత్వ బిల్ కు వ్యతిరేకంగా అంజన్ కుమార్ ర్యాలీ..

పౌరసత్వ బిల్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజనీకుమార్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ భవన్ నుండి అంజనీ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. దీంతో పర్మిషన్ లేకుండా ర్యాలీ తీయడంతో… అంజనీకుమార్ ను ఆయనతో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన… ముస్లింలకు పౌరసత్వం ఉండదన్న వాదన ఉంది కాబట్టే తాము ర్యాలీ చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ, హోం మినిష్టర్ అమిత్ షా కలిసి ప్రజల మధ్య విభజన చేస్తున్నారని చెప్పారు.

ఏఐసీసీ పిలుపు మేరకు పౌరసత్వ సవరణ బిల్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు అంజనీ కుమార్. బంగ్లాదేశ్ , పాకిస్థాన్ , ఆప్ఘనిస్థాన్ వస్తున్న ముస్లింలకు పౌరసత్వం ఉండదు కాబట్టే తాము ఈ బిల్ ని వ్యతిరేకిస్తున్నమని చెప్పారు. భారత దేశం అంటే సెక్యులర్ దేశమని ….పౌర సత్వ బిల్ అందరకి ఒకేలా ఉండాలని అంజనీ కుమార్ డిమాండ్ చేశారు.