చెన్నై సింపుల్ గా గెలిచేసింది. ఢిల్లీ ఇచ్చిన టార్గెట్ ను 15 బాల్స్ మిగిలి ఉండగానే ఊదేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 48వ మ్యాచ్ లో చెన్నై 5వ విజయాన్ని అందుకుంది. చెన్నై స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్..( 52 బంతులలో 87 రన్స్, 7 ఫోర్లు, 6 సిక్సులు ) భారీ స్కోర్ తో చెలరేగటంతో చెన్నైకి గెలుపు చాలా ఈజీ అయ్యింది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (13 బంతులలో 6 పరుగులు)ను ఔట్ చేసి షాకిచ్చాడు లుంగీ ఎన్గిడి. డీప్ స్కేర్ లెగ్ లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు గైక్వాడ్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ (9 బాల్స్ లో 17 రన్స్).. రెండు సిక్సులతో ఆకట్టుకున్నప్పటికీ.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో 7వ ఓవర్ లో స్టంప్ అవుట్ అయ్యాడు.
నిలెబట్టిన శాంసన్:
ఒకవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అవుటైనా.. సంజూ శాంసన్ తన పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఫోర్లు సిక్సులతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో ఏకంగా రెండు సిక్సులు, ఒక ఫోర్ బాది 32 బంతులలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వికెట్ పడకుండా భారీ సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్ మొత్తం చెన్నై గ్రిప్ లోకి వచ్చేలా చేశాడు. కార్తీక్ శర్మ (31 బంతులలో 41) మెరుపు ఇన్నింగ్స్ సహకారంతో చెన్నైకి గెలుపును అందించాడు. ఈ గెలుపుతో చెన్నైకి ఇది 5వ విజయం. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితుల్లో చెన్నైకి ఈ విజయం కీలకంగా మారింది.
ఢిల్లీ ఫ్లాప్ షో:
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఐపీఎల్ 2026 లో భాగంగా 48వ మ్యాచ్ లో ఢిల్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై అద్భుతమైన ఛేజింగ్ చేసిన ఢిల్లీ.. చెన్నైపై భారీ టార్గెట్ ఉంచుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 155 రన్స్ మాత్రమే చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ పవర్ ప్లేలో ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. చెన్నై బౌలర్లు పట్టు సాధించడంతో పవర్ ప్లేలో 6 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 37 రన్స్ మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు టపా టపా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ కు క్యూ కట్టారు.
ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (24 బంతులలో 40, 4 సిక్సులు), స్టబ్స్ (31 బంతులలో 38 రన్స్, 1 ఫోర్, 2 సిక్సులు) ఇద్దరే ఢిల్లీని ఆదుకున్నారు. అంతకు ముందుబౌండరీలతో ఖాతా తెరిచిన ఓపెనర్లు ఇద్దరూ వెంట వెంటనే ఔటయ్యారు. 4వ ఓవర్‌లో ముఖేష్ బౌలింగ్ లో నిస్సంక 19 పరుగులకు ఔట్ కాగా.. 6వ ఓవర్‌లో అకీల్ హోసేన్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ 12 పరుగులకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మంచి ఫామ్ మీదున్న రాహుల్ భారీ స్కోర్ తో ఢిల్లీని ఆదుకుంటాడనుకుంటే.. నిరాశపరిచాడు. ఆ తర్వాత 8వ ఓవర్ చివరి బంతికి కరుణ్ నాయర్ (13) నూర్ అహ్మద్ బౌలింగ్ లో గుర్జప్నీత్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత10వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్ లో నితీశ్ రాణా 15 (13) .. స్వీప్ షాట్ ఆడబోయి కార్తీక్ శర్మకు క్యాచ్ దొరికిపోయాడు. ఆ వెంటనే 11వ ఓవర్ చివరి బంతికి గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ (2) ఔటయ్యాడు. దీంతో 11వ ఓవర్లో 72 రన్స్ దగ్గర 5 కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఢిల్లీ.
ఆదుకున్న స్టబ్స్, రిజ్వీ:
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్ 38, సమీర్ రిజ్వీ 40 స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి (69–5) పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీకి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. రిజ్వీ 24 బంతుల్లో 40 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టబ్స్ తో పాటు స్ట్రైక్ రొటేట్ చేస్తూ లూస్ బాల్స్ ను పనిష్ చేస్తూ మంచి పాట్నర్షిప్ బిల్డ్ చేశాడు. రజ్వీ కూడా భారీ క్లెవర్ షాట్స్ ఆడుతూ ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చివర్లో అశుతోష్ శర్మ 5 బంతులలో 2 సిక్సర్లతో 14 రన్స్ చేసి స్కోర్ ను పరిగెత్తించాడు. రుతురాజ్ గైక్వాడ్ రనౌటో చేయగా వెనుదిరిగాడు.
ఢిల్లీ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు, అకియాల్ హోసెన్, ముఖష్ చైదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
