Vishwambhara Music: ‘విశ్వంభర’ నుంచి తప్పుకున్న కీరవాణి.. ఆస్కార్ విన్నర్ ప్లేస్‌లో హరి గౌర!

Vishwambhara Music: ‘విశ్వంభర’ నుంచి తప్పుకున్న కీరవాణి.. ఆస్కార్ విన్నర్ ప్లేస్‌లో హరి గౌర!

మెగాస్టార్ చిరంజీవి-వశిష్ఠ కాంబోలో వస్తున్న 'విశ్వంభర'పై భారీ అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్‌పై అధికారిక అప్డేట్స్ లేకపోయినా, తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా అభిమానుల్లో చర్చకు దారితీసింది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్ విజేత M. M. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (RR) బాధ్యతల నుంచి తప్పుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే పాటల బాధ్యత మాత్రం ఆయన దగ్గరే కొనసాగుతుందని సమాచారం. ఈ లెజండరీ స్థానంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ హరి RR పనులు కూడా చేపట్టినట్టు సమాచారం.

గ్రాఫిక్స్ పనుల ఆలస్యం, అలాగే జక్కన్న-మహేష్ ప్రాజెక్ట్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మార్పు జరిగి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్. అయితే, ఈ వార్తపై అధికారిక ప్రకటన రాకపోయినా, మ్యూజిక్ టీమ్ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషియో ఫాంటసి, విఫెక్స్, గ్రాఫిక్స్ వంటి ఆధారిత సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది కీరవాణి లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్నాడనే వార్త మెగా అభిమానుల్లో కొంత నిరాశ కలిగిస్తోంది. ఇదే సమయంలో గౌర హరి ఎంట్రీతో హ్యాపీ గా కూడా ఉన్నారు. ఎందుకంటే, హనుమాన్, మిరాయ్ వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు హరి గౌర. ఇపుడు ఈ యంగ్ టాలెంటెడ్ హరి.. తనదైన స్కోర్ తో మెగా ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకోనున్నాడో చూడాలి.  

అయితే మరోవైపు, గౌర హరి లాంటి యంగ్ టాలెంట్ ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తి కూడా పెరిగింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ‘విశ్వంభర’కు ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ వార్తపై క్లారిటీ రావాల్సి ఉంది.

►ALSO READ | విజయ్ సీఎం అయినా విడాకుల కేసులో కోర్టుకు వెళ్లాల్సిందేనా..? జూన్ 15న ఏం జరగబోతోంది..?

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నోసార్లు పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది. కానీ, జూలై 10న విడుదల కాబోతున్న వార్త ఇపుడు వైరల్ అవుతుంది. మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే మెగా ఫ్యాన్స్ లో సందేహాలు తీరిపోతాయి. 
 
ఇకపోతే, చిరంజీవి కెరీర్‌లో ఫాంటసీ, సోషియో ఫాంటసీ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అంజి' వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. ఈ సినిమాల్లో చిరు నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి ఒక పూర్తిస్థాయి ఫాంటసీ చిత్రంలో నటించడం అభిమానులకు పండగే.