తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకట నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగనున్నారు. తెలుగు భాషాభివృద్ధి, తెలంగాణ తెలుగు అకాడమీ ప్రచురణలను ఆయన పర్యవేక్షించనున్నారు.
తెలంగాణలో 18 కార్పోరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ 2026 మే 06వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ అకాడెమీ చైర్మన్ గా ప్రొఫెసర్ వెంకటనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రొఫెసర్ వెంకటనారాయణ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మేధావులను ఏకథాటిపైకి తెచ్చి ఉద్యమ ఆకాంక్షలను తెలియజేయడంలో ముందున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై సూటిగా ప్రశ్నించేవారు. వివిధ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చిన ప్రొఫెసర్ వెంటక నారాయణను తెలుగు అకాడమీ చైర్మన్ పదవి వరించడం సముచితంగా భావిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎంతో కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమయింది. పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు, సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకాలను చేపట్టిం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమారు 18 కార్పొరేషన్లు , ఏజెన్సీలకు పదవులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
ALSO READ : కాంగ్రెస్ పార్టీలో పదవుల సందడి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్రభుత్వం ఈ పదవులను భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పదవుల్లో నియమితులైన వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరికొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు.
