హైదరాబాద్ లో బెంగాల్ నటి కి వేధింపులు.. నిందితుడు అరెస్ట్..

హైదరాబాద్ లో బెంగాల్ నటి కి వేధింపులు.. నిందితుడు అరెస్ట్..

హైదరాబాద్ లో బెంగాల్ నటికి వేధింపులు ఎదురవ్వడం కలకలం రేపింది. బుధవారం ( మే 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ వచ్చిన ఓ బెంగాల్ నటి ప్రత్యూష పాల్ చార్మినార్ చూసేందుకు వెళ్లగా అక్కడ ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వెంటనే అలర్ట్ అయిన ప్రత్యూష పోకిరీని పట్టుకుంది. ఈ క్రమంలో ఆకతాయికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అనంతరం నిందితుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు.

వెస్ట్ బెంగాల్ కు చెందిన నటి ప్రత్యూష పాల్ మే 2న కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో చార్మినార్ సందర్శించిన నటి అక్కడి ఫుట్ పాత్ మీద వస్తువులు చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు నిందితుడు.

►ALSO READ | ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే.. పోకిరీల భరతం పట్టిన మల్కాజ్ గిరి సీపీ

ఇలాంటి ఆకతాయిల వల్ల హైదరాబాద్ పరువు పోతుందని అంటున్నారు స్థానికులు. చార్మినార్ లాంటి టూరిస్ట్ స్పాట్ కు ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు వస్తుంటారని.. ఇలాంటి ప్రాంతాల్లో ఆకతాయిలను కట్టడి చేసేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.