మల్కాజ్ గిరి మహిళా పోలీస్ కమిషనర్ సుమతి ఛార్జ్ తీసుకున్న రోజే అర్థరాత్రి వేళ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు ఫీల్డ్ కు వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలనుంచి తెల్లవారుజామున 3గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మహిళలను వేధిస్తున్న 40 పోకరిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఆపరేషన్ లో భాగంగా దిల్ సుఖ్ నగర్ బస్టాండులో సాధారణ ప్రయాణికురాలిగా నిల్చున్నారు సీపీ సుమతి.. మూడు రోజులు దిల్ సుఖ్ బస్టాండులో స్వయంగా నిఘా పెట్టారు సీపీ. సగటు మహిళకు ఎదురయ్యే వేధింపుల ఫేస్ చేశారు. అయితే కమిషనర్ అని తెలియక కొందరు ఆకతాయిలు ఆమెను చుట్టుముట్టారు. ఆమెను రకరకాల అసభ్యకర ప్రశ్నలతో వేధించారు. బస్టాండులో ధైర్యంగా ఉండి అందరినీ గమనించారు సీపీ. ఆ సమయంలో అటువైపు కన్నెత్తి చూడలేదు పెట్రోలింగ్ పోలీసులు. చివరికి రంగంలోకి దిగి 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. పోకిరీల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉండటం గమనార్హం.
