రెండేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం... నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ వంశీకృష్ణ

రెండేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం... నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ వంశీకృష్ణ

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. బుధవారం ( మే 6 ) జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని... నిరుద్యోగులకు ఉపాధి కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

కష్టపడితే ఫలితం ఉంటుందని.. ప్రతి ఒక్కరు కష్టపడి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ATC లు ఉన్నాయని...వాటి ద్వారా నిరుద్యోగులు స్కిల్స్ నేర్చుకుని ఉపాధి అవకాశాలు పొందొచ్చని అన్నారు. రాష్ట్రంలో మరో 120 కొత్త ATC లు రాబోతున్నాయని... 15 వేల నుంచి 20 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. 

కాలానికి అనుగుణంగా స్కిల్స్ అవసరమని.. అలాంటి స్కిల్స్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. ప్రభుత్వం తరఫున మంచిర్యాల జిల్లాలో కూడా ఒక జాబ్ మేళా నిర్వహించాలని కోరుతున్నానని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..యువత ను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పరిశ్రమల్లో జాబ్స్ కావాలంటే నైపుణ్యం ఉండాలని.. లేకపోతే పెంచుకోవాలి..అందుకే ముందుగా స్కిల్స్ నేర్చుకోవాలని అన్నారు.

టాస్క్ ద్వారా 4 వేల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాళ కల్పించామని... షార్ట్ లిస్ట్ లో 1500 మంది ప్రస్తుతం ఉద్యోగాలు పొందారని అన్నారు. మంచిర్యాలలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తామని...యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.