Kangana Ranaut: 26/11 ముంబై దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. 'భారత్ భాగ్య విధాత' ఫస్ట్ లుక్ రిలీజ్!

Kangana Ranaut: 26/11 ముంబై దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. 'భారత్ భాగ్య విధాత' ఫస్ట్ లుక్ రిలీజ్!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' భారత్ భాగ్య విధాత '(Bharat Bhhagya Viddhaata) . ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు.  లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

26/11 ముంబై దాడుల నేపథ్యంలో..

ఈ మూవీ కథాంశం ప్రధానంగా భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన '26/11 ముంబై ఉగ్రదాడుల' చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఆ భయంకరమైన రాత్రి కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్ (Cama and Albless Hospital) లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాణాలకు తెగించి సామాన్యులను కాపాడిన 'అన్‌సంగ్ హీరోస్' కు ఈ సినిమా ఒక నివాళిగా నిలవనుంది. 

ఆసక్తికరమైన ఫస్ట్ లుక్

పోస్టర్ చూస్తుంటేనే ఇది ఎంత ఎమోషనల్ అండ్ ఇంటెన్సివ్ డ్రామాగా ఉండబోతుందో అర్థమవుతోంది. "సామాన్యుల అసాధారణ కథ! భయం కంటే మానవత్వం గొప్పగా నిలిచిన రాత్రి కథ ఇది. బాధ్యత త్యాగంగా మారిన వేళ.. ఐక్యతే కర్తవ్యంగా మారి ప్రాణాలను కాపాడిన వైనం అంటూ మేకర్స్ ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ చిత్రం జూన్ 12, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

►ALSO READ | Nithiin: ఇద్దరు కొత్త కుర్రాళ్లతో.. నితిన్ కొత్త మూవీ షురూ.. కలిసొచ్చే జానర్తో హిట్ కొట్టేలా!

కంగనా రనౌత్ పాత్ర ఇదే..

ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఒక నర్స్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఉగ్రదాడుల సమయంలో ఆసుపత్రిలోని సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను ఎలా రక్షించారనేది ఆమె పాత్ర ద్వారా చూపించబోతున్నారు. ప్రముఖ నటి గిరిజా ఓక్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. మనోజ్ తపాడియా ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. 

రియలిస్టిక్ డ్రామాస్

కంగనా రనౌత్ గత చిత్రం 'ఎమర్జెన్సీ' లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు మరో చారిత్రక ప్రాధాన్యత ఉన్న సినిమాతో రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కంగనా ముందుకు సాగుతున్నారు. సామాన్యుల పోరాట పటిమను, ధైర్యాన్ని చాటిచెప్పే 'భారత్ భాగ్య విధాత' వెండితెరపై ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.