టాలీవుడ్ హీరో నితిన్ కొత్త సినిమాను ప్రకటించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ పూజా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నారి సిరిసవాడ, సోమశేఖర్ టి అనే ఇద్దరు దర్శకులు పరిచయమవుతున్నారు. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు.
నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మే రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. కేవలం 55 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో వచ్చిన భీష్మ తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఇది కీలక ప్రాజెక్ట్. అందుకు తగ్గట్టుగానే నితిన్ కి సెట్ అయ్యే కథాంశంతో, పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ ఎంటర్‌టైన్మెంట్ కలయికగా ఉండబోతోందని టాక్.
ALSO READ : ఓటీటీలోకి ఉత్కంఠరేపే లీగల్ థ్రిల్లర్..
'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'తమ్ముడు' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో తన తర్వాతి సినిమాల విషయంలో నితిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
#SitharaEntertainments Production No. 43 begins on a beautiful note with an auspicious Pooja Ceremony ✨
— Sithara Entertainments (@SitharaEnts) May 6, 2026
Shoot starts from the 2nd week of May 🔥@actor_nithiin @RitikaNayak_ @NariSirisawada @somuthota @vamsi84 #SaiSoujanya @sureshbobbili9 #AnithMadadi @jonnyshaik @SVR4446… pic.twitter.com/j8o0YjQX4G
సరికొత్త కథతో..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటేనే క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా వెచ్చిస్తున్నారట. సరికొత్త పాయింట్‌తో, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నితిన్ - రితికా నాయక్ జోడీ వెండితెరపై ఒక ఫ్రెష్ ఫీల్‌ను ఇవ్వనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం నితిన్ తన 36వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ V. I. ఆనంద్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, నితిన్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే, నితిన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అంజి చెప్పిన కథకు నితిన్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్లాప్స్తో ఉన్న నితిన్, ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
NO BODY…NO RULES
— nithiin (@actor_nithiin) January 25, 2026
The rules of reality just changed. Very eager to start the journey with my brother @Dir_VI_Anand & @srinivasaaoffl garu 😊
@SS_Screens pic.twitter.com/hrO6GRMPvq
