PEDDI Story: 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా.. ‘పెద్ది’ కథపై ఆర్ట్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

PEDDI Story: 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా.. ‘పెద్ది’ కథపై ఆర్ట్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విడుదల తేదీ దగ్గరపడింది. వచ్చే నెల జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇంతలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి పెద్దిపై మరింత హైప్ పెంచేస్తున్నారు. లేటెస్ట్గా ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకి ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన అవినాష్ కొల్లా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా..

“పెద్ది కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా. 70-80 దశకాల నేపథ్యంలో, విజయనగరం గ్రామీణ వాతావరణంలో కథ సాగుతుంది. ఈ ప్రపంచాన్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించేందుకు మేము ఏడాది పాటు ప్రీ-ప్రొడక్షన్‌లో పని చేశాం. 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు నిర్మించాం అని చెప్పేదానికంటే వాటికి ప్రాణం పోశామని” అన్నారు.

ఆ కాలం నాటి ఇళ్లు, వీధులు, వాతావరణం ప్రతిబింబించేలా ఈ సెట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దామని చెప్పారు. విజయనగరం మట్టి వాసన, అక్కడి యాస, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదని అవినాష్ వెల్లడించారు.

ఇక దర్శకుడు బుచ్చి బాబు మేకింగ్ అద్భుతంగా ఉందని, రామ్ చరణ్ నటన ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుందని అవినాష్ కొల్లా అన్నారు. ఈ చిత్రంలో పనిచేసే అవకాశం దక్కడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్లు” అవినాష్ కొల్లా చెప్పారు.

పెద్ది స్పోర్ట్స్ కార్..

పెద్ది సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కొత్త స్థాయికి చేరుకున్నాయి. ‘పెద్ది’ పోస్టర్‌తో పాటు రామ్ చరణ్ స్టైలిష్ స్టిల్స్‌తో డిజైన్ చేసిన ప్రత్యేక స్పోర్ట్స్ కార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్‌కు మ్యాచ్ అయ్యేలా ప్రత్యేక కీచైన్‌ను కూడా రూపొందించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వీడియోలో రామ్ చరణ్ సోదరి, నిర్మాత సుష్మిత కారును పరిశీలించి, టీమ్ ప్రయత్నాలను అభినందించారు.

►ALSO READ | Kangana Ranaut: 26/11 ముంబై దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. 'భారత్ భాగ్య విధాత' ఫస్ట్ లుక్ రిలీజ్!

శృతి హాసన్తో ఐటెం సాంగ్..

ఇటీవలే శృతి హాసన్తో హైదరాబాద్‌లో ఒక భారీ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరించారు. 'ఎవడు' సినిమా తర్వాత చరణ్, శృతి మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఈ సాంగ్‌ను టాలీవుడ్ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేయగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ అందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఒక్క పాట కోసం శృతి హాసన్ దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, ఒక ఐటమ్ సాంగ్ కోసం ఇంత భారీ మొత్తం అందుకోవడం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుగా మారుతుంది.