రూ.140 కోట్ల డైమండ్ నెక్లెస్తో హైదరాబాద్ మేఘా సుధారెడ్డి : మెట్ గాలా ఈవెంట్ హైలైట్స్ !

రూ.140 కోట్ల డైమండ్ నెక్లెస్తో హైదరాబాద్ మేఘా సుధారెడ్డి : మెట్ గాలా ఈవెంట్ హైలైట్స్ !

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది పాత సామెత.. మన మెగా కృష్ణారెడ్డి తలచుకుంటే వజ్ర, వైఢూర్యాలకు కొదవా ఏంటీ.. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఏలిన రాజులు, రాణుల దగ్గర పెద్ద పెద్ద వజ్రాలు ఉండేవని వినేవాళ్లం.. అప్పడప్పుడు వాళ్లు ధరించినప్పుడు చూసేవాళ్లం.. ఇప్పుడు అలాంటి వజ్రాలు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి (మెయిల్ కంపెనీ ఓనర్) భార్య సుధారెడ్డి దగ్గర కనిపిస్తున్నాయి.

అవును.. మీరు విన్నది నిజమే.. మెగా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి ధరించిన వజ్రం విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 140 కోట్ల రూపాయలు. వాళ్లూ వీళ్లూ చెప్పటం కాదు.. జాతీయ పత్రికలో వచ్చిన కథనంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు.

ప్రముఖ హైదరాబాద్ బిలియనీర్ సుధా రెడ్డి అమెరికాలోని మెట్ గాలాలో తళుక్కుమన్నారు. సౌంత్ ఇండియా వారసత్వాన్ని క్యారీ చేస్తూ 2026 మే 05వ తేదీన మెట్ గాలా రెండ్ కార్పెట్ పై నడిచి ఆశ్చర్యపరిచారు.  ట్రీ ఆఫ్ లైఫ్ అనే థీమ్ తో కూడిన డ్రెస్సింగ్ తో ఆకట్టుకున్నారు. 

సుధారెడ్డి మెట్ గాలా ప్రదర్శనకు హాజరవ్వటం ఇది మూడవ సారి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ట్రీ ఆఫ్​ లైఫ్ అనే థీమ్ కాస్ట్యూమ్స్ తో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ప్రదర్శన సందర్భంగా ఆమె ధరించిన నెక్లెస్ ఈవెంట్ కు హాజరైన అందరినీ ఆకట్టుకుంది. 15 మిలియన్ డాలర్లు అంటే 140 కోట్ల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఆమె వాక్ చేశారు. ప్రతీ ఏటా ఒక్కో కలర్ డైమండ్ ధరించే ఆమె ఈసారి వంకాయ రంగులో ఉన్న పెద్ద డైమండ్ ధరించి వావ్ అనిపించారు. 

ఈ ప్రత్యేకమైన నెక్లెస్, విక్టోరియన్ శైలిలో తయారు చేశారు. త్రిభుజాకార, బేరిపండు (పియర్ షేప్) ఆకారపు రోజ్-కట్ వజ్రాలను సున్నితమైన పూల గుత్తులుగా అమర్చారు. దీనికి ప్రధాన ఆకర్షణగా, టాంజానియాలోని మెరెలాని కొండల నుండి సేకరించిన, అందరినీ ఆకట్టుకునే 550-క్యారెట్ల క్వీన్ ఆఫ్ మెరెలాని అనే ముదురు ఊదా-నీలం రంగు (వాయిలెట్–బ్ల) టాంజనైట్ రత్నాన్ని అమర్చారు. ఈ నెక్లెస్ కు మరింత ఆకర్షణ తెచ్చేందుకు   రాజస్థాన్‌కు చెందిన 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ డైమండ్ రింగ్ ధరించారు. 

ప్రతీ ఏటా నిర్వహించే మెట్ గాలా ప్రదర్శనలో.. ఈసారి మెట్ గాలా డ్రెస్ కోడ్.. ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తన ఫౌండేషన్ హైదరాబాద్ అనీ అన్నారు. తన ప్రాంతం సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడం తన లక్ష్యం అన్నారు. భారత హస్తకళ అనేది కేవలం వారసత్వంగా వస్తున్నదే కాదని.. భారతీయులకు అది సజీవంగా ఉండే ఒక కళారూపం అని అన్నారు. 

 మల్హోత్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన, పొడవైన ట్రెయిల్ ఉన్న స్విర్ల్ గౌనును ధరించారు సుధా రెడ్డి. బంగారు జర్దోజీ, మెటాలిక్ అలంకరణలతో కూడిన, కార్సెట్ ఉన్న ఈ రాయల్ బ్లూ వెల్వెట్ గౌను రాజసం ఉట్టిపడేలా అందరినీ ఆకర్శించింది.