V6 News

ఇద్దరు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు

ఇద్దరు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు
  • 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూర్​ మున్సిపాలిటీ, సర్పంచ్ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని కాకిరాల హరిప్రసాద్, కిశోర్ రెడ్డిపై ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్​క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారని ఆ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. 

ఆ ఇద్దరు నాయకులు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, హరిప్రసాద్ ఇంట్లో శుభకార్యక్రమం ఉండడం, కిశోర్ రెడ్డి అమెరికా వెళ్లడంతో ఇద్దరూ కమిటీ ముందుకు రాలేకపోయారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆదేశించారు.