V6 News

పెళ్లికి వెయ్యి మంది హాజ‌రైనా ప‌ట్టించుకోలే

పెళ్లికి వెయ్యి మంది హాజ‌రైనా ప‌ట్టించుకోలే

హైద‌రాబాద్: ఖైర‌తాబాద్ లోని స‌ర్కార్ హాస్పిట‌ల్ ను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని సీరియ‌స్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్. ఖైరతాబాద్ లోని బడా గణేష్ సమీపంలో ఈ హాస్పిటల్ ఉంద‌ని..రూ.10కోట్లతో కాంగ్రెస్ సర్కార్ దీన్ని నిర్మించిందన్నారు. హాస్పిట‌ల్ లో 50 బెడ్ల సామర్థ్యం ఉన్నా..  100 బెడ్ల వరకు పెంచవచ్చు అన్నారు. కోవిడ్ కోసం వాడుకోవాలని చెబుతున్నా పట్టించుకోలేదని తెలిపారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూనే.. లాస్ట్ వీక్ లో కాంగ్రెస్ నేతలు హాస్పిటల్స్ విజిట్ చేశామ‌న్నారు.

అయితే.. తెలంగాణ సర్కార్ మాపై కేసులు పెట్టిందన్నారు. పాత బస్తీలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెళ్లి వేడుకలో వెయ్యి మంది హాజరయ్యారని..ఆ పెళ్లికి హోం మంత్రి, డీజీపీ కూడా అటెండ్ అయ్యారని తెలిపారు. టీఆరెఎస్ లీడర్స్ కోవిడ్ రూల్స్ పట్టించుకోకుండా.. ఏమైనా చేసుకోవచ్చా అని ప్ర‌శ్నించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆయ‌న‌..మాపై వెయ్యి కేసులు పెట్టుకున్నా.. మా పోరాటం ఆగదన్నారు.