V6 News

అందంగా ఉంటే సరిపోదు.. ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకో.. ప్రియాంక చోప్రాపై కొరియో గ్రాఫర్ సీరియస్!

అందంగా ఉంటే సరిపోదు.. ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకో..  ప్రియాంక చోప్రాపై కొరియో గ్రాఫర్ సీరియస్!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇండియన్ సినిమాల్లోనే కాదు.. హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ తన సత్తాను చాటుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ' వారణాసి' లో నటిస్తుంది. ఇప్పుడు ఒక గ్లోబల్ ఐకాన్‌గా వెలిగిపోతున్న ప్రియాంకా చోప్రా జోనస్ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. అందాల పోటీల నుండి వెండితెరకు పరిచయమైన ఈ 'దేశీ గర్ల్', ఆరంభంలో నటన, నృత్యం విషయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలోని చేదు జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు.

అవమానంలో ప్రియాంక!

కెరీర్ మొదట్లో తనకు డ్యాన్స్ అస్సలు వచ్చేది కాదని ప్రియాంక నిజాయితీగా ఒప్పుకున్నారు. నటిస్తూనే స్టెప్పులు వేయడం, కో-స్టార్‌తో కోఆర్డినేట్ చేసుకోవడం నా 20 ఏళ్ల మెదడుకు అప్పట్లో చాలా కష్టంగా అనిపించేది అని ఆమె తెలిపారు. ఒకసారి సౌత్ ఆఫ్రికా షూటింగ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారని చెప్పింది. సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోతుంటే.. ఆయన మైక్ విసిరేసి, నువ్వు అందాల పోటీల నుండి వచ్చి ఉండవచ్చు, కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో అని అందరి ముందు అరిచేశారట. ఆ క్షణం ఎంతో అవమానంగా అనిపించిందని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.

కత్రినా కైఫ్‌తో కలిసి సాధన

ఆ అవమానమే ఆమెను రాటుదేల్చింది. ఎలాగైనా డ్యాన్స్‌లో పట్టు సాధించాలని పట్టుబట్టిన ప్రియాంక.. రోజుకు ఆరు గంటల పాటు సాధన చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.. విశేషం ఏమిటంటే, అప్పట్లో మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి ఆమె డ్యాన్స్ క్లాసులకు వెళ్లేవారు. ఆ కఠిన శ్రమ ఫలితంగానే 'దేశీ గర్ల్', 'రామ్ చాహే లీలా' వంటి ఐకానిక్ సాంగ్స్‌లో అద్భుతమైన స్టెప్పులతో అలరించగలిగారు. ప్రస్తుతం రాజు ఖాన్ , ప్రియాంక మంచి స్నేహితులు .

ALSO READ : సంజయ్ కపూర్ రూ.30 వేల కోట్ల ఆస్తుల గొడవలో బిగ్ ట్విస్ట్..!

 రీఎంట్రీ!

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. అది కూడా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) తో కావడం గమనార్హం. ఇది ఒక భారీ టైమ్-ట్రావెల్ అడ్వెంచర్ చిత్రం.  మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్-ఇండియా లెవల్లో ఈ సినిమా రూపొందుతోంది.

హాలీవుడ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక, రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్ సినిమాతో తిరిగి రావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ విజువల్ వండర్ ఏప్రిల్ 2027లో థియేటర్లలో సందడి చేయనుంది. విమర్శలనే మెట్లుగా మార్చుకుని ఎదిగిన ప్రియాంక ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.