‘హాత్ సే హాత్ జోడో’ సమావేశానికి సీనియర్ల రాకపై ఉత్కంఠ

‘హాత్ సే హాత్ జోడో’ సమావేశానికి సీనియర్ల రాకపై ఉత్కంఠ

ఏఐసీసీ పిలుపుమేరకు కాసేపట్లో గాంధీభవన్‭లో ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశం జరగనుంది. రేవంత్ అధ్యక్షతన జరుగనున్న ఈ మీటింగ్‭కు.. సీనియర్ నేతలు హాజరవుతారా లేరా అన్నది సస్పెన్స్‭గా మారింది. రేవంత్ మీద తిరుగుబాటు చేసిన సీనియర్లు.. పీసీసీ మీటింగ్‭లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశానికి హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు మీటింగ్ పెట్టుకుని మరోవైపు సీనియర్లు తమ సొంత జిల్లాల్లో పెళ్లిళ్లకు హాజరుకావడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ వర్గం సీనియర్లకు కౌంటర్ ఇస్తోంది. ‘మునుగోడులో సీనియర్లు లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా?’ అని మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ ప్రశ్నించారు. 12 మంది ఎమ్మెల్యేలు మారితే ‘సేవ్ కాంగ్రెస్ గుర్తుకు రాలేదా?’ అన్నారు. వెంకట్ రెడ్డి... రాజగోపాల్ కు ఓటు వేయండి అని చెప్పినప్పుడు సీనియర్లు ఏమయ్యారని నిలదీశారు. అసలు రేవంత్ రెడ్డితో మీకు ఇబ్బంది ఏంటని సీనియర్ల పై ఈరవర్తి అనిల్ ఫైర్ అయ్యారు. 

మరోవైపు ఏఐసీసీ సెక్రటరీలు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఇక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ..స్టేట్ కాంగ్రెస్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కేసీ వేణుగోపాల్ ను రిపోర్ట్ కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో ఢిల్లీకి రావాలని సీనియర్లకు అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు హాజరైన వారిలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, చలమల్ల కృష్ణారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు.