కేసీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదించిండు : పొన్నాల

కేసీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదించిండు : పొన్నాల

వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఫామ్హౌస్ కేంద్రంగా పాలన చేస్తున్నాడని.. అక్రమంగా వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. దేశంలో సచివాలయానిక రాని సీఎం..కేసీఆర్ ఒక్కడే అని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

హైదరాబాద్లోని లుంబిని పార్క్ వద్ద  మాజీ సీఎం టంగుటూరి అంజయ్య 36వ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. టంగుటూరు ఆంజయ్య కార్మికుల పక్షపాతి అని.. యువత ఆంజయ్యను ఆదర్శంగా తీసుకుని మందుకు సాగాలన్నారు. ప్రజలకు మెడికల్ ట్రీట్మెంట్ బాగుండాలని కార్పొరేట్ సంస్థలు రాష్ట్రానికి తీసుకరావడంలో అంజయ్య కీలకంగా వ్యవహరించారన్నారు.