సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అడ్డు చెప్పొద్దు..అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అడ్డు చెప్పొద్దు..అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
  • రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియ సజావుగా సాగాలి
  • అధికారుల వివరాలు ఇవ్వడంలో జాప్యంపై బెంగాల్ సర్కారుపై ఆగ్రహం

ఈసీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియకు ఏ రాష్ట్రం కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందులో జాప్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌‌‌‌)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియకు ఏ రాష్ట్రంకూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించింది. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందులో ఎలాంటి జాప్యాన్ని అనుమతించబోమని స్పష్టంచేసింది.

బెంగాల్‌‌లో సర్‌‌‌‌ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వేలాదిమంది మైక్రో-అబ్జర్వర్లను నియమించడాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌‌ చేశారు. ఈ పిటిషన్‌‌పై సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బెంగాల్ ప్రభుత్వం అధికారుల వివరాలను అందజేయడంలో జాప్యం చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

‘‘మేం ఫిబ్రవరి 4నే ఆదేశాలు ఇచ్చినా, ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు మెయిల్ ద్వారా పేర్లను ఎందుకు పంపారు?’’ అని సీఎం మమతా బెనర్జీని ధర్మాసనం నేరుగా ప్రశ్నించింది. ముందస్తుగా స్పందించి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదని అభిప్రాయపడింది. ‘‘అవసరమైన అన్ని ఆదేశాలు, స్పష్టతలను మేం ఇస్తాం. కానీ సర్‌‌‌‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు’’ అని సీజేఐ  జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.

ఇరుపక్షాల వాదనలు..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినంత మంది సిబ్బంది సహకారం అందకపోవడం వల్లే తాము మైక్రో- అబ్జర్వర్లను నియమించాల్సి వచ్చిందని కోర్టుకు ఈసీ వివరించింది. సర్‌‌‌‌ కోసం 300 మంది అధికారులను కేటాయించాలని బెంగాల్‌‌ ప్రభుత్వాన్ని కోరితే.. 80 మంది గ్రేడ్‌‌-2 స్థాయి అధికారులనే  కేటాయించిందని తెలియజేసింది. బెంగాల్‌‌ సర్కారు తరఫున లాయర్లు‌‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాల్లో చేర్చడంలేదని పేర్కొన్నారు.

ఇంటి పేర్లలో అక్షరదోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాల్లో చేంజెస్‌‌లాంటి చిన్నలోపాలను సాకుగా చూపి..  ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు. తాము అధికారుల వివరాలను సిద్ధం చేశామని, మైక్రో-అబ్జర్వర్ల కంటే రాష్ట్ర అధికారులే ఈ పనులకు సమర్థులని వాదించారు. చివరకు సుమారు 8,505 మంది గ్రూప్ -బీ అధికారులను సర్‌‌‌‌ ప్రక్రియ కోసం కేటాయిస్తామని బెంగాల్‌‌ సర్కారు అంగీకరించింది. రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును మరో వారం పాటు పొడిగించింది.