
ప్రగతి భవన్ ను డైనమైట్లు పెట్టి పేల్చేసిన తప్పేమిలేదన్న టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమర్థించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ మన్నెగూడ నుండి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని అన్నారు. మోసపూరిత హామీలిచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన నాయకులకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని చెప్పడమే తమ నాయకుడి ఉద్దేశమని రామ్మోహన్ అన్నారు. నక్సలిజం తమ ఎజెండా కాదని స్పష్టం చేశారు. రేవంత్ పాదయాత్రకు పార్టీ సీనియర్లందరి మద్దతు ఉందని.. వారంతా త్వరలోనే పాదయాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు.