దమ్మాయిగూడ రేప్‌ ఘటనపై సీతక్క రియాక్షన్

దమ్మాయిగూడ రేప్‌ ఘటనపై సీతక్క రియాక్షన్

హైదరాబాద్: మూడు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో గుర్తు తెలియని దుండగులు మూడేళ్ల పాపను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన ఘటన తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని గురువారం ఆమె హాస్పిటల్‌కు వెళ్లి చూశారు. ఆ పాప కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారికి న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉండి, పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ దారుణం జరిగి మూడ్రోజులవుతున్నా ఇంత వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వేగంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తాను నేరుగా డీజీపీని కలిసి కోరుతానని సీతక్క చెప్పారు.