మూడు నెలల పాపను కూడా జైళ్లో పెట్టారు

మూడు నెలల పాపను కూడా జైళ్లో పెట్టారు

ఆదివాసీ, గిరిజనుల మీద అటవీశాఖ అధికారుల దాడులపై అఖిలపక్ష పోరాటం కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఆదివాసీ హక్కుల కోసం ఈ పోరాటం కొనసాగాలన్నారు. 6 వేల కోట్ల కాంప నిధులు తీసుకువచ్చి అటవీ పెంచుతున్నామని చెప్పి భూములు లాక్కుంటున్నారన్నారు. మెదక్ లో 8 శాతం అటవీ తగ్గిపోయిందన్నారు. కార్పొరేట్  కంపెనీలకు మైనింగ్ కి అటవిని అప్పగిస్తున్నారన్నారు. సాగులో ఉన్న భూములను కార్పొరేట్ కు అప్పగించడానికే జమయి చెట్లు పెంచుతున్నారన్నారు.  ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. మూడు నెలల పాపను కూడా జైళ్లో  నిర్భందించారని...అడవారిపై అటవీ అధికారుల వేధింపులు ఆపాలన్నారు.