జమ్ము కశ్మీర్ భారత్ లో అంతర్భాగం కావడంలో నెహ్రు కృషి గొప్పదన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. 370 ఆర్టికల్ రద్దుతో 371 ఆర్టికల్ కల్గి ఉన్న రాష్ట్రాలకు ఏం సందేశం పంపుతారని మనీష్ ప్రశ్నించారు. 371 ఏ నుంచి ఐ వరకు ఉన్న ఆర్టికల్స్….. నాగాలాండ్, అస్సోం, మనీపూర్, ఆంధ్రా, సిక్కింలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టాయని చెప్పారు మనీష్.
70 ఏళ్లలో కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చాలన్న డిమాండ్లను చూశామన్న మనీష్..మొదటిసారి ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని అన్నారు. ఈ విధానం సమాఖ్య నిర్మాణానికి విఘాతంగా అభివర్ణించారు.

